తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇళ్ల పంపిణీ పారదర్శకంగా జరుగుతోంది' - పేదల సొంతింటి కల

ప్రభుత్వం చేపట్టిన రెండు పడకల గదుల కార్యక్రమాన్ని.. జిల్లా యంత్రాంగం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తోందని ​సిద్ధిపేట అడిషనల్ కలెక్టర్ పద్మాకర్​ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో.. డ్రా పద్ధతిలో నిర్వహించిన ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

Siddipet Additional Collector says double bed room distribution is done in transparent manner.
'ఇళ్ల పంపిణీ పారదర్శకంగా జరుగుతోంది'

By

Published : Jan 8, 2021, 12:57 PM IST

సిద్ధిపేట అడిషనల్ కలెక్టర్ పద్మాకర్​.. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. 1341మంది లబ్ధిదారులకు డ్రా పద్ధతిని నిర్వహించి.. అందులో 224మందికి ఇళ్లను కేటాయించారు.

ప్రభుత్వం చేపట్టిన రెండు పడకల గదుల కార్యక్రమం పేదల సొంతింటి కలను నెరవేర్చిందన్నారు పద్మాకర్​. జిల్లా యంత్రాంగం.. ఇళ్ల పంపిణీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తోందని​​ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:గరీబోల్లకే డబుల్​ బెడ్​రూం ఇళ్లు.. ఆ సంఘటనే నిదర్శనం: హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details