బక్రీద్ సందర్భంగా గోవధ చేయరాదని ముస్లిం సోదరులకు సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ సూచించారు. తన కార్యాలయంలో ముస్లిం మతపెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. పండుగను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం గోవధ నిషేధించిందని.. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'గోవధ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం' - bakrred festival
సిద్దిపేట ఏసీపీ కార్యాలయంలో పోలీసులు ముస్లిం మతపెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఏసీపీ రామేశ్వర్ సూచించారు. గోవధ చేయకూడదని... అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
siddipet acp rameshwar held meeting with Muslims for bakreed festival
మతాలను పరస్పరం గౌరవించుకుంటూ పండుగను నిర్వహించుకోవాలని తెలిపారు. అన్ని కులాల మతాల పండుగ పర్వదినాలను శాంతియుతంగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు. మత సామరస్యం గురించి ప్రతి ఒక్కరు పాటుపడాలని తెలిపారు. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా... సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సప్ నంబర్ 7901100100, డయల్ 100కు ఫోన్ చేసి తెలపాలని సూచించారు.