శివసేన 24గంటల దీక్ష - Shivasena party Strike for Husnabad municipality
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శివసేన పార్టీ ఆధ్వర్యంలో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ 24గంటల దీక్ష చేపట్టారు.
శివసేన 24గంటల దీక్ష
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ శివసేన పార్టీ ఆధ్వర్యంలో 24 గంటల దీక్ష చేపట్టారు. పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో నూతన భవన నిర్మాణానికి చేపట్టిన టెండర్ల స్వీకరణ ప్రక్రియను నిలిపివేయాలని వెల్లడించారు. పట్టణానికి సమీపంలో ప్రజలకు అందుబాటులో ఉండే స్థలంలో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.