సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలోని శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామి వారిని దర్శించుకోవడానికి రాత్రివేళలోనూ వేల సంఖ్యలో భక్తులు ఆలయం ఎదుట బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శివరాత్రి వేళ ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో చేసే జాగారం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాత్రంతా ప్రత్యేక గీతాలు పాడుతూ భక్తులు జాగారం చేసి స్వామి వారిని కీర్తించారు.