సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామంలో హైదరాబాద్కు చెందిన గోకరాజు శివలక్ష్మి స్వచ్ఛంద సేవాసంస్థ అధ్యక్షుడు గున్నేపల్లి గంగారాజు ఆధ్వర్యంలో ఉపాధి హమీ కూలీలకు మాస్కులను పంపిణీ చేశారు.
సిద్దిపేట జిల్లాలో ప్రజలకు స్వచ్ఛంద సంస్థ సాయం - etv bharat latest news
లాక్డౌన్ వేళ సాయంచేసేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. గోకరాజు శివలక్ష్మి స్వచ్ఛంద సేవాసంస్థ సిద్దిపేట జిల్లాలోని ఉపాధి హమీ కూలీలకు మాస్కులను పంపిణీ చేశారు.
help
అదేవిధంగా గ్రామంలో కరోనాతో బాధపడుతున్న వారికి ట్రే గుడ్లను పంపిణీ చేశారు. హైదరాబాదులో ప్రతిరోజు 100 నుంచి 150 మంది నిరుపేదలకు పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు. గ్రామ సర్పంచ్ సహాకారంతో మరన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని నిర్వహకులు తెలిపారు.
ఇదీ చూడండి: దొంగ నంబరు ప్లేట్లతో దర్జా.. వాహన యజమానులకు ఇబ్బందులు