హుస్నాబాద్ శివసేన పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు కంకర, మట్టితో రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చి ఆదర్శంగా నిలిచారు. హుస్నాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్లే ప్రధాన రహదారిలో గత కొన్ని రోజులుగా గుంతలు ఏర్పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కిలోమీటరు మేర దాదాపు 30 గుంతలు ఏర్పడడంతో వందల కొద్దీ వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి ప్రమాదకరమైన ఈ గుంతలను పూడ్చివేసి రహదారిని బాగు చేయాలని శివసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు.
ప్రధాన రహదారిపై గుంతలు పూడ్చిన శివసేన కార్యకర్తలు - ప్రధాన రహదారిపై గుంతలు పూడ్చిన శివసేన కార్యకర్తలు
హుస్నాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్లే రహదారిపై దాదాపు 30 గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. వీటిని అధికారులు పట్టించుకోకపోయినా.. శివసేన కార్యకర్తలు పట్టించుకొని వాటిని పూడ్చి ఆదర్శంగా నిలిచారు.
ప్రధాన రహదారిపై గుంతలు పూడ్చిన శివసేన కార్యకర్తలు
TAGGED:
SHIVASENA