సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో రోజురోజుకు కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నందున తహశీల్దార్ కార్యాలయంలో కిటికీల నుంచే ప్రజలకు అధికారులు సేవలందిస్తున్నారు. వారి సమస్యలను కిటికీల నుంచే పరిష్కరిస్తున్నారు. ప్రజలు, అధికారులు మహమ్మారి కరోనా బారిన పడకుండా ఉండేందుకు కిటికీల ద్వారానే సేవలు అందిస్తున్నట్లు తహశీల్దార్ తెలపారు.
కొవిడ్ భయం.. కిటికీల నుంచే అధికారుల సేవలు - services to people done through windows at mirudoddi
కొవిడ్ కేసులు వేగంగా వ్యాపిస్తున్నందున సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో కిటికీల నుంచే ప్రజలకు అధికారులు సేవలందిస్తున్నారు. ప్రజలు, అధికారులు మహమ్మారి కరోనా బారిన పడకుండా ఉండేందుకు కిటికీల ద్వారానే సేవలు అందిస్తున్నట్లు తహశీల్దార్ తెలపారు.
కొవిడ్ భయం.. కిటికీల నుంచే అధికారుల సేవలు
ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలందరూ భౌతికదూరం, స్వీయనియంత్రణ పాటించాలని మండల తహశీల్దార్ సుజాత తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, శానిటైజర్ వాడాలని కోరారు. ప్రజలకు కావాల్సిన సేవల దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తున్నట్లు తహశీల్దార్ వెల్లడించారు. అత్యవసరమైతేనే కార్యాలయాలకు రావాలని సూచించారు.
ఇదీ చూడండి:పీఓకేలో ఆనకట్ట నిర్మాణంపై భారత్ తీవ్ర నిరసన