సిద్ధిపేట జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి దుబ్బాకలో లాక్డౌన్ పొడిగించారు. దుబ్బాక పట్టణంలో స్వచ్ఛందంగా ఆగష్టు 1 నుంచి ఆగష్టు 15 వరకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అన్ని దుకాణాలు తెరుచుకొని 2 గంటల నుంచి మూసివేయాలని పట్టణ వ్యాపార సంఘం, వర్తకులు, వివిధ సంఘాలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు నిర్ణయించారు. వైరస్ను కట్టడి చేసేందుకు దుబ్బాకలో అందరి అభిప్రాయాలు తీసుకొని లాక్డౌన్ పొడిగించినట్టు దుబ్బాక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ చింత రాజు తెలిపారు. ఇంతకు ముందు విధించుకున్న లాక్డౌన్ కరోనా కేసులు మరిన్ని నమోదవుతున్న నేపథ్యంలో మరో పదిహేను రోజులు పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. దీనికి అన్ని వర్తక, వ్యాపార సంఘాలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల వారు ఆమోదం తెలిపారని, కరోనా వైరస్ను కట్టడి చేయడానికి దుబ్బాక ప్రజలు అందరం కలసికట్టుగా లాక్డౌన్ పాటించి వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని అన్నారు.
దుబ్బాకలో కరోనా విజృంభణ.. లాక్డౌన్ పొడిగింపు! - దుబ్బాకలో లాక్డౌన్ పొడిగింపు
సిద్ధిపేట జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి దుబ్బాకలో స్వచ్ఛంద లాక్డౌన్ పొడిగించారు. దుబ్బాక పట్టణంలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్నందున మండలాధికారులు, స్థానికులు కలిసి.. స్వచ్ఛంద లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నారు.
దుబ్బాకలో కరోనా విజృంభణ.. లాక్డౌన్ పొడిగింపు!