సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో ప్రభుత్వం రాయితీపై అందిస్తోన్న విత్తనాలను ఎమ్మెల్యే సతీశ్ కుమార్ రైతులకు అందజేశారు. బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాల మాఫీ విషయంలో కూడా 25 వేల రూపాయల చెక్కులు త్వరలో రాబోతున్నాయని తెలిపారు.
దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రైతు! - seeds distributed in husnabad
దేశంలోనే తెలంగాణ రైతులను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సతీశ్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రభుత్వం రాయితీపై అందిస్తోన్న విత్తనాలను రైతులకు అందజేశారు.
హుస్నాబాద్‌లో రైతులకు విత్తనాలు
కరోనా లాక్‌డౌన్‌తో ప్రపంచమంతా స్తంభించిపోయినా తెలంగాణలో మాత్రం రైతులకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ రాజారెడ్డి, మున్సిపల్ ఛైర్ పర్సన్ ఆకుల రజిత పాల్గొన్నారు.