ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన - siddipet latest news
సైన్సు దినోత్సవాన్ని పురస్కరించుకోని సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి పట్టణ కేంద్రంలో విద్యార్థులచే వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలోని టీఎస్డబ్ల్యూఆర్ పాఠశాల్లో జాతీయ సైన్సు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిరుదొడ్డి ఎస్ఐ శ్రీనివాస్ హాజరయ్యారు. ప్రదర్శనలో ముఖ్య ఆకర్షణగా స్కెలిటన్ ప్రతిమ, సోలార్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టం, రిస్క్ ఫ్రీ ఎలక్ట్రానిక్ పవర్ పెన్స్ సిస్టం, డీజే సౌండ్ ద్వారా సౌండ్ పొల్యూషన్, హ్యూమన్ ఆర్గాన్స్కు సంబంధించిన వివరణ, హ్యూమన్ సెల్స్ అధ్యయనం ముఖ్య ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్ఐ తెలిపారు.