సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కరోనా లాక్డౌన్ అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. 9, 10 ఆపైన తరగతులు ప్రభుత్వ సూచనల మేరకు నేడు ప్రారంభమయ్యాయి. తరగతి గదులను శుభ్రం చేయించిన ఉపాధ్యాయులు... పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు గేట్ వద్దే థర్మల్ స్క్రినింగ్ పరీక్షలు నిర్వహించారు. తల్లిదండ్రుల అంగీకార పత్రాలను స్వీకరించారు.
సిద్దిపేట జిల్లాలో మోగిన బడి గంట.. విద్యార్థుల ఉత్సాహం - Telangana News Updates
తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అయితే సిద్దిపేట జిల్లాలో కూడా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ... విద్యార్థులు పాఠశాలలకు చేరుకున్నారు.
సిద్దిపేట జిల్లాలో మోగిన బడి గంట.. విద్యార్థుల ఉత్సాహం
తరగతి గదుల్లో విద్యార్థిని విద్యార్థుల మధ్య కనీసం రెండు మీటర్ల దూరాన్ని కేటాయించారు. బెంచ్‌కు ఒకరిని మాత్రమే కూర్చొబెట్టారు. చాలా రోజుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి:పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజా సింగ్