ప్రభుత్వ పాఠశాలల్లో 2015 సంవత్సరం నుంచి పనిచేస్తున్న స్కావెంజర్లు సిద్దిపేట జిల్లా కొహెడ మండలంలో భిక్షాటన చేస్తూ రోడ్డుపై నిరసన తెలిపారు. జీవో నెంబర్ 2026 ద్వారా గ్రామపంచాయతీ కార్మికులతో పాఠశాలలు, ఆవరణ, తరగతి గదులు మూత్రశాలలు శుభ్రం చేయించుకోమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో కార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం 2026 జీవోను జారీ చేసి కార్మికులను రోడ్డున పడేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు.
భిక్షాటన చేస్తూ స్కావెంజర్ల ఆందోళన
సిద్దిపేట జిల్లా కొహెడ మండలంలో స్కావెంజర్లు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల పరిశుభ్రత బాధ్యతలు గ్రామ పంచాయతీలకు అప్పగించడంతో వేలాది మంది రోడ్డునపడే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు.
భిక్షాటన చేస్తూ స్కావెంజర్ల ఆందోళన
గతంలో రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు తమ లాంటి చిన్న ఉద్యోగులను జీవో ద్వారా పక్కనపెట్టి తమ బతుకులతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: లాబీయింగ్ మొదలుపెట్టిన వీఆర్వోలు.. నచ్చిన శాఖ కోసం పైరవీలు!