తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎస్సీ రైతులతో దీక్ష విరమింపజేసిన ఎమ్మెల్యే - రైతుల దీక్ష విరమణ సిద్దిపేట జిల్లా

సిద్దిపేట జిల్లా బస్వాపూర్​లో 40 ఎకరాల భూ వివాదం విషయంలో గత మూడు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఎస్సీ రైతుల దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే సతీశ్​ కుమార్ సందర్శించారు. ఈ భూ వివాదం ప్రస్తుతం హైకోర్టులో ఉందని.. తీర్పు వచ్చే వరకు ప్రభుత్వ భూమిగానే కొనసాగుతుందని వివరించారు.

ఎస్సీ రైతులతో దీక్ష విరమింపజేసిన ఎమ్మెల్యే
ఎస్సీ రైతులతో దీక్ష విరమింపజేసిన ఎమ్మెల్యే

By

Published : Nov 19, 2020, 9:28 PM IST

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో 40 ఎకరాల భూ వివాదం విషయంలో గత మూడు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఎస్సీ రైతుల దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే సతీశ్​ కుమార్ సందర్శించారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి ఇంతకుముందు వివాదంలో ఉ​న్న 40 ఎకరాలకు ఇచ్చిన పట్టా పాసు పుస్తకాలను రద్దు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయాన్ని హైకోర్టుకు కూడా నివేదించామని పేర్కొన్నారు.

ఎస్సీ రైతులతో దీక్ష విరమింపజేసిన ఎమ్మెల్యే

ప్రస్తుతం 40 ఎకరాల భూ వివాదం హైకోర్టులో పెండింగ్​లో ఉందని.. కోర్టు తీర్పు వచ్చే వరకు 40 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగానే కొనసాగుతుందని, ఆ భూమిపై ఇక మీదట ఎవరికి ఏ విధమైన హక్కులు ఉండవని సతీశ్​ కుమార్​ వెల్లడించారు. రైతులు చేస్తున్న దీక్షకు ప్రభుత్వం, అధికారులు స్పందించి వివాదంలో ఉన్న భూమి పాసు పుస్తకాలు రద్దు చేశారని, కోర్టు తుది తీర్పును అనుసరించి అది ఎవరికి కేటాయిస్తే వారికే ఉంటుందన్నారు. ఇక రిలే నిరాహార దీక్షను విరమించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​ విజ్ఞప్తి మేరకు ఎస్సీ రైతులు తమ రిలే నిరాహార దీక్షను విరమించుకున్నారు.

ఇదీ చదవండి:హైదరాబాద్​లో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర.. సహించం: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details