సిద్దిపేటజిల్లా దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు చీరలను పంపిణీ చేస్తుండగా తెరాస నాయకులు అడ్డుపడ్డారు. రాయపోల్ మండలం తిమ్మక్కపల్లిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై చీరలను పెట్టుకొని ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు.
ఓటర్లకు చీరల పంపిణీ.. అడ్డంగా దొరికిపోయిన ముగ్గురు వ్యక్తులు - ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చీరల పంపిణీ
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకుగాను కొందరు కాంగ్రెస్ నాయకులు తిమ్మక్కపల్లిలో చీరలు పంపిణీ చేస్తుండగా తెరాస నాయకులు అడ్డుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వారి ముగ్గురిపై పోలీసులు కేసునమోదు చేశారు.

ఓటర్లకు చీరల పంపిణీ.. అడ్డంగా దొరికిపోయిన ముగ్గురు వ్యక్తులు
విషయం గుర్తించిన తెరాస నాయకులు వారిని అడ్డుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ద్విచక్ర వాహనం, చీరలను స్వాధీనం చేసుకుని... చీరల పంపిణికి పాల్పడిన ముగ్గురు యువకులపై కేసునమోదు చేశారు.
ఇదీ చూడండి:ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మేయర్ పర్యటన