సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొలువై ఉన్న సరస్వతి అమ్మవారికి వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాలు చేపట్టి... గ్రామంలోని వీధుల గుండా సరస్వతి దేవికి పల్లకి సేవ నిర్వహించారు.
సరస్వతిదేవికి ఘనంగా శ్రీపంచమి వేడుకలు - సరస్వతిదేవికి ఘనంగా శ్రీపంచమి వేడుకలు
సిద్దిపేట జిల్లా మోతే గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టారు.

సరస్వతిదేవికి ఘనంగా శ్రీపంచమి వేడుకలు
అనంతరం చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించారు. సరస్వతి అమ్మవారికి భక్తులు ఒడి బియ్యం సమర్పించారు. లక్ష పుష్పార్చన, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
సరస్వతిదేవికి ఘనంగా శ్రీపంచమి వేడుకలు
ఇదీ చూడండి: బాసర సరస్వతి దేవి ఆలయంలో ఘనంగా శ్రీ పంచమి వేడుకలు