తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేటలో సేఫ్‌ టన్నెల్‌ ఏర్పాటు - Corona Virus Siddipet Safe Tunnel

కరోనా వ్యాప్తి నివారణ కోసం సిద్దిపేటలో సేఫ్‌ టన్నెల్‌ ఏర్పాటు చేశారు. మంత్రి హరీశ్‌రావు సూచనలతో స్థానిక తాత్కాలిక కూరగాయల మార్కెట్‌లో సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి దీన్ని ఏర్పాటు చేసింది.

సేఫ్‌ టన్నెల్‌
సేఫ్‌ టన్నెల్‌

By

Published : Apr 18, 2020, 1:22 PM IST

రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు విజ్ఞప్తి మేరకు సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పట్టణంలో సేఫ్‌ టన్నెల్‌ని ఏర్పాటు చేశారు. స్థానిక తాత్కాలిక కూరగాయల మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ఈ సేఫ్ టన్నెల్‌ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల సాయిరాం ప్రారంభించారు. ఈ టన్నెల్ గుండా వెళ్లే వారిపై సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణం స్ప్రే అయి.. వైరస్ మరణిస్తుందని సాయిరాం తెలిపారు. ఈ సౌకర్యాన్ని రైతులు, వినియోగదారులు వినియోగించుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details