సిద్దిపేట జిల్లా దుబ్బాక నగర పంచాయతీలోని స్థానిక బస్ డిపో ఎదుట తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. మినీ బస్సు డ్రైవర్ బాలయ్యను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ విధులు బహిష్కరించారు. ఆర్టీసీ కార్మికుల నిరసనతో 18 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. మినీ సర్వీస్ బస్సులో కండక్టర్ లేకపోవడం వల్ల డ్రైవరే టికెట్టు ఇవ్వాల్సి వచ్చింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడం వల్ల డ్రైవర్ సరిగా టికెట్టు తీసుకోకపోయినందున అధికారులు తొలగించారు. డ్రైవర్ బాలయ్యను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిపో యాజమాన్యాన్ని కోరారు.
'డ్రైవర్ను విధుల్లోకి తీసుకోవాలి'
బస్సు డ్రైవర్ సస్పెన్షన్ను నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేశారు. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చోటుచేసుకుంది.
'డ్రైవర్ను విధుల్లోకి తీసుకోవాలి'
ఇవీ చూడండి: 21వేల మంది పోలీసులతో నిమజ్జనానికి భద్రత