తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసులకు, ఆర్టీసీ సిబ్బంది మధ్య స్వల్ప వాగ్వాదం

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది.

rtc_employees_arrest_at_gajwel_prajnapur
పోలీసులకు, ఆర్టీసీ సిబ్బంది మధ్య స్వల్ప వాగ్వాదం

By

Published : Nov 26, 2019, 2:28 PM IST

సిద్దిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో వద్ద పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఐకాస పిలుపుమేరకు విధుల్లో చేరేందుకు వచ్చిన ఆర్టీసీ సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

పోలీసులకు, ఆర్టీసీ సిబ్బంది మధ్య స్వల్ప వాగ్వాదం
విధుల్లో చేరుతామంటే తమను ఎందుకు అడ్డుకుంటున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేవరకు విధుల్లో చేరవద్దంటూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రత్యేక వాహనంలో ఠాణాకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details