హుస్నాబాద్‌లో రోడ్డెక్కిన ప్రగతి చక్రాలు - rtc buses start
హుస్నాబాద్‌లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
![హుస్నాబాద్‌లో రోడ్డెక్కిన ప్రగతి చక్రాలు siddipet district latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7255417-167-7255417-1589860288791.jpg)
siddipet district latest news
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే డిపో పరిధిలోని అన్ని రూట్లకు బస్సులు బయలుదేరాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డిపోలోనే బస్సులకు శానిటైజ్ చేసి పంపిస్తున్నారు. మాస్కు లేకుండా ఎవరిని బస్సులోకి అనుమతించడం లేదు. లాక్డౌన్ నేపథ్యంలో ఇన్ని రోజులుగా బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను తిరిగి ఎప్పటిలానే పోలీస్ స్టేషన్ రహదారి వైపు తరలించారు.