రాష్ట్రంలో రహదారుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రోడ్లు గుంతలమయంగా మారి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, జనగామకు వెళ్లే ప్రధాన రహదారులు దుమ్ము, ధూళితో నిండుకోవడంతో వ్యాపారస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు గుంతలకు తాత్కాలికంగా మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, శాశ్వత పరిష్కారం చూపడం లేదని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షడు శ్రీనివాస్ మండిపడ్డారు.
హుస్నాబాద్ రోడ్లు గుంతలమయం... పట్టించుకోని అధికారులు - హుస్నాబాద్ తాజా సమాచారం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పట్టణంలోని ప్రధాన రోడ్లన్ని గుంతలమయంగా మారాయి. దుమ్ము, ధూళితో నిండిపోయి వాహనదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు శాశ్వత మరమ్మతులు చేయకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హుస్నాబాద్ రోడ్లు గుంతలమయం... పట్టించుకోని అధికారులు
ఇప్పటికే చాలాసార్లు గుంతలను బాగు చేయించాలని ధర్నాలు చేశామన్నారు. స్పందించిన అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కొద్ది రోజులకే గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారుతున్నాయని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఆదివారం పది గంటల పది నిమిషాల కార్యక్రమంలో పురపాలక ఛైర్మన్, పాలకవర్గం రహదారుల దుస్థితిపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.