తెలంగాణ

telangana

ETV Bharat / state

గజ్వేల్‌లో రోడ్డు భద్రతా వారోత్సవాలు - road safety weeks in gajwel

మన భద్రత కోసం శిరస్త్రాణం ధరించాలని గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఛైర్మన్ రాజమౌళి అన్నారు. గజ్వేల్ పట్టణంలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని శ్రీవిద్యానికేతన్ పాఠశాల యాజమాన్యం విద్యార్థులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

గజ్వేల్‌లో రోడ్డు భద్రతా వారోత్సవాలు
గజ్వేల్‌లో రోడ్డు భద్రతా వారోత్సవాలు

By

Published : Feb 1, 2020, 5:56 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. స్థానిక శ్రీవిద్యానికేతన్ పాఠశాల యాజమాన్యం, విద్యార్థులతో మున్సిపల్‌ ఛైర్మన్‌ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఇందిరా పార్క్ వరకు ర్యాలీ కొనసాగింది. విద్యార్థులు రహదారి భద్రత నిబంధనలపై నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ కొనసాగించారు. ద్విచక్ర వాహనాలు నడుపుతున్నపుడు శిరస్త్రాణం పెట్టుకోకపోవడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుతున్నాయని మున్సిపల్ ఛైర్మన్‌ అన్నారు. ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలని కోరారు.

గజ్వేల్‌లో రోడ్డు భద్రతా వారోత్సవాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details