తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు వేసిన నెలరోజులకే పగుళ్లు - మంచినీళ్ల బండ గ్రామం

సిద్దిపేట జిల్లా మంచినీళ్ల బండ గ్రామంలో రోడ్డు వేసి నెలరోజులైన కాలేదు.. అప్పుడే పగుళ్లు ఏర్పడింది. రోడ్డుకు ఇరువైపులా బీటలు వారింది. కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు.

రోడ్డు వేసిన నెలరోజులకే పగుళ్లు

By

Published : Aug 5, 2019, 2:33 PM IST

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మంచినీళ్ల బండ గ్రామం. ఈ గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఎన్నో ఆశలతో మరెన్నో కలలతో ఈ పంచాయతీ ఏర్పడింది. గ్రామానికి కొత్తగా రోడ్డు వేశారు. దీని కోటి ఆరవై లక్షలు ఖర్చు చేశారు. నెల రోజుల వ్యవధిలోనే రోడ్డు మొత్తం పగిలిపోయి వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది.కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన రోడ్డు నెల రోజులు గడవకుండానే ఇలా అవడం పట్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోని వెంటనే రోడ్డు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు.

రోడ్డు వేసిన నెలరోజులకే పగుళ్లు

ABOUT THE AUTHOR

...view details