మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం మట్టిని తరలిస్తున్న టిప్పర్లు మితిమీరిన వేగంతో వెళుతుండటం వల్ల పరిసర ప్రాంతాల్లో ప్రమాదాలు నిత్య కృత్యంగా మారుతున్నాయి. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ సమీపంలో మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బ్రిడ్జి పిల్లర్ పైకి దూసుకెళ్లింది.
మితిమీరిన వేగంతో బ్రిడ్జి పిల్లర్‌పైకి దూసుకెళ్లిన టిప్పర్ - tipper accident in siddipet
సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం కేంద్రంలోని మోడల్ స్కూల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంగా దూసుకెళ్లిన లారీ అదుపుతప్పి బ్రిడ్జి పిల్లర్‌ను ఢీ కొట్టింది. ఘటన సమయంలో బ్రిడ్జిపై ఎవరూ లేకపోవడం ప్రమాదం తప్పింది.

బ్రిడ్జి పిల్లర్‌పైకి దూసుకెళ్లిన టిప్పర్
ఘటన సమయంలో ఎవరూ గాయపడలేదు. డ్రైవర్ పరారయ్యాడు. నిత్యం ఏదో చోట ప్రమాదాలు జరుగుతున్నా అధికారుల్లో చలనం లేదంటూ స్థానికులు వాపోతున్నారు.
బ్రిడ్జి పిల్లర్‌పైకి దూసుకెళ్లిన టిప్పర్