సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో రైతు వేదికల ప్రారంభోత్సవం రసాభాసగా మారింది. దుబ్బాకలో రైతు వేదికలు ప్రారంభించిన అనంతరం కొత్త సాగు చట్టాలపై ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాలను రాజకీయ వేదికగా మార్చుకోవడం మానుకోవాలని భాజపా కార్యకర్తలు హితవు పలకడం వల్ల తెరాస-భాజపా కార్యకర్తల మధ్య వాగ్వాదం మొదలైంది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం వల్ల ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వేదిక నుంచి వెళ్లిపోయారు.
దుబ్బాక రైతు వేదిక ప్రారంభోత్సవంలో రసాభాస - rythu vedika building inauguration
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జరిగిన రైతు వేదిక భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమంలో తెరాస ఎమ్మెల్సీ సాగు చట్టాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం వల్ల భాజపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెరాస-భాజపా కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

దుబ్బాక రైతు వేదిక ప్రారంభోత్సవంలో రసాభాస
రైతు వేదికల ప్రారంభోత్సవానికి రైతులను ఆహ్వానించకపోవడంపై భాజపా నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రైతు వేదికల నిర్మాణం కొనసాగుతోందని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనాల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ఆరోపించారు.
- ఇదీ చూడండి :'సాగు చట్టాలు రద్దు చేసే వరకు పోరాటం ఆగదు'