తెలంగాణ

telangana

ETV Bharat / state

కాలనీ నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్ - Siddipet District Mutrajpally Latest News

సిద్దిపేట జిల్లా ముట్రాజ్‌పల్లి ఆర్‌&ఆర్‌ కాలనీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ పి.వెంకటరామ రెడ్డి ఆదేశించారు. ఇళ్లను జనవరి15 లోపు పూర్తి చేయాలని పేర్కొన్నారు. పలు నమూనాలు పరిశీలించి ఇంజనీర్లు, ఏజెన్సీ ప్రతినిధులకు తగు సూచనలు చేశారు.

Breaking News

By

Published : Dec 24, 2020, 10:57 PM IST

సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్‌పల్లి శివారులో నిర్మిస్తున్న పునరావాస కాలనీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ పి.వెంకటరామ రెడ్డి ఆదేశించారు. 1,450 గృహాలను జనవరి15 లోపు పూర్తి చేయాలని పేర్కొన్నారు. గజ్వెల్ ఆర్డీఓ కార్యాలయంలో అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షించారు.

ఆధునాతనంగా..

ఫంక్షన్ హాల్, సామూహిక భవనం మంచి డిజైన్‌తో ఆధునాతనంగా నిర్మించి ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పలు నమూనాలు పరిశీలించి ఇంజనీర్లు, ఏజెన్సీ ప్రతినిధులకు సూచనలు, సలహాలిచ్చారు. వీధి దీపాలు, నీటి ట్యాంకు, మిషన్ భగీరథ పైపులైన్, రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

అధికార యంత్రాంగమంతా కలిసి కట్టుగా పని చేద్దాం. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి. కాలనీపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. -పి.వెంకటరామ రెడ్డి, సిద్దిపేట కలెక్టర్

ఇదీ చూడండి:'కేసీఆర్​ వల్లే కరెంటు, సాగునీటి కష్టాలు తీరినయ్'

ABOUT THE AUTHOR

...view details