సిద్దిపేటలో రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన - siddipet revenue employees protest
అబ్దుల్లాపూర్మెట్ ఎమ్మార్వో పై జరిగిన ఘటనను నిరసిస్తూ... సిద్దిపేటలో రెవెన్యూ ఉద్యోగులు ధర్నాకు దిగారు.
సిద్దిపేటలో రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన
తహశీల్దార్ విజయారెడ్డి మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని సిద్దిపేట కలెక్టరేట్ వద్ద రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులపై ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడటం బాధారమని ఆవేదన వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?