తెలంగాణ

telangana

ETV Bharat / state

'పార్కు నిర్మాణం కోసం సాగు భూమిని లాక్కుంటారా..?' - siddipet news

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లిలో పార్కు భూమి కోసం పంటపొలాన్ని స్వాధీనం చేసుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తున్న తమ నుంచి భూమిని లాక్కోవద్దని వేడుకుంటున్నారు.

revenu officers hand over farming land in mallupalli
revenu officers hand over farming land in mallupalli

By

Published : Aug 29, 2020, 11:32 AM IST

పార్కు నిర్మాణం కోసం ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పంట పొలాన్ని అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లికి చెందిన కుర్ర కనకరాజు, కుర్ర శ్రీనివాస్​కు సర్వే నంబర్ 150లో 25 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇద్దరు అన్నదమ్ములు భూమిని సాగు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ జీవనోపాధి అయిన పందుల పెంపకాన్ని కూడా వదిలేశారు.

వ్యవసాయం మీదే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్న తరుణంలో రెవెన్యూ అధికారులు భూమిని స్వాధీనం చేసుకుంటే తమ పరిస్థితేంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. అభివృద్ధి కోసం నిరుపయోగంగా ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాల్సిన అధికారులు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన భూములను స్వాధీనం చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఎలాగైనా స్పందించి తమ భూములను లాక్కోకుండా చూడాలని వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి :ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ABOUT THE AUTHOR

...view details