తెలంగాణ

telangana

ETV Bharat / state

216 మంది కలిసి కలెక్టర్​, ఆర్డీవోకు వినతిపత్రం - Collector&Rdo handed over request letter

సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్ గ్రామ నిర్వాసితులు మొత్తం 216 మంది కలెక్టర్, ఆర్డీవోకు తమ సమస్యలను పరిష్కరించాలంటూ వినతిపత్రం అందజేశారు. తాము లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని గ్రామ నిర్వాసితులు కోరుతున్నారు.

Collector&Rdo handed over request letter
216 మంది కలిసి కలెక్టర్​, ఆర్డీవోకు వినతిపత్రం

By

Published : Jul 28, 2020, 9:52 PM IST

సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్ గ్రామ నిర్వాసితులు మొత్తం 216 మంది కలెక్టర్, ఆర్డీవోకు తమ సమస్యలను పరిష్కరించాలంటూ వినతిపత్రం అందజేశారు. పొమ్మన లేక పొగబెట్టిన చందంగా ప్రభుత్వాధికారుల తీరుందని విమర్శించారు. గ్రామానికి వచ్చే రోడ్లను త్రవ్వేశారని.. వర్షం పడితే కట్టపై నుంచి రాకపోకలు నిలిచిపోతాయని.. అత్యవసర పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిందేనని వాపోయారు.

నెలలో రెండు, మూడు సార్లు ముట్రాజ్​పల్లిలో నిర్వాసితుల ఇళ్లపైనా రివ్యూ చేసినట్లు చేప్పారని, ఇటీవలే విమానంలో కూలీలను తీసుకొచ్చి ఇళ్లు కట్టిస్తామని ప్రకటన కూడా ఇచ్చారన్నారు. తాము లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని.. లేకుంటే న్యాయసలహాలు తీసుకుని ముందుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామని గ్రామ నిర్వాసితులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details