తెలంగాణ

telangana

ETV Bharat / state

'సిద్దిపేట జిల్లాకు త్వరలో కాళేశ్వరం నీళ్లు' - సిద్దిపేట జిల్లాకు త్వరలో కాళేశ్వరం నీళ్లు

సిద్దిపేట జిల్లాకు కొద్ది రోజుల్లోనే కాళేశ్వరం నీళ్లు వస్తాయని జిల్లా పాలనాధికారి వెంకట్రామిరెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు.

Siddipet Collector
Siddipet Collector

By

Published : Jan 26, 2020, 5:43 PM IST


సిద్దిపేట జిల్లాలోని ఇంటింటికీ మిషన్‌ భగీరథ ద్వారా నల్ల కలెక్షన్ ఇచ్చి మంచినీరు అందిస్తున్నామని కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు.
రానున్న కొద్ది రోజుల్లోనే సిద్దిపేట జిల్లాకు కాళేశ్వరం నీళ్లు వస్తాయని, జిల్లాలో ఏర్పాటు చేసిన రిజర్వాయర్ నిండుకుండలా మారనుందన్నారు. సంక్షేమ పథకాలతో జిల్లాలోని గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. రైతుబంధు ద్వారా రైతులకు ఎకరా భూమికి సంవత్సరానికి రూ.10 వేలు ఇస్తున్నామని చెప్పారు. మరణించిన రైతు కుటుంబానికి రైతు బీమా కింద ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తున్నామని తెలిపారు.
అనంతరం పలువురు స్వాతంత్ర సమరయోధులను సన్మానించి, అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, సిద్దిపేట జిల్లా సీపీ జోయల్ డేవిస్, జాయింట్ కలెక్టర్ పద్మాకర్‌, అధికారులు పాల్గొన్నారు.

సిద్దిపేటలో ఘనంగా గణతంత్ర దినోత్సవాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details