సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా హుస్నాబాద్ రేణుక ఎల్లమ్మ అమ్మవారు ప్రసిద్ధి. ఏటా నెలరోజులపాటు వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవాలు వైశాఖ పౌర్ణమి రోజున ప్రారంభమై, జేష్ఠ పౌర్ణమి వరకు కొనసాగుతాయి. నేడు శుక్రవారం అయినందున ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారికి బోనాలతో పట్నాలు వేయడం, చీరలు పెట్టి ఒడిబియ్యం పోయడం, గండ దీపాలు వెలిగించడం, కుంకుమార్చనలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు. ఈ జాతర ఉత్సవాలు జూన్ 17 వరకు కొనసాగుతాయి.
ఘనంగా రేణుక ఎల్లమ్మ జాతర - RENUKA ELLAMMA_MLA DHARSHANAM
హుస్నాబాద్ పట్టణంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మొక్కులు చెల్లించుకునేందుకు శుక్రవారం భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఘనంగా రేణుక ఎల్లమ్మ జాతర