పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ... సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఉపకార వేతనాలు ఆలస్యంగా విడుదల కావడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించని నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తీవ్రతరం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులతో మాట్లాడి నిరసనను విరమింపజేశారు.
'ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయండి' - ఏబీవీపీ
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ఉపకారవేతనాలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
'ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయండి'