గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి కారకుడైన టిప్పర్ డ్రైవర్ను గుర్తించి వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతుని కుటుంబ సభ్యులు రాస్తారోకో చేశారు.
గజ్వేల్లో రోడ్డు ప్రమాద మృతుడి బంధువులు ఆందోళన - siddipet latest news
గుర్తుతెలియని టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో మృతిచెందిన యువకుడి కుటుంబసభ్యులు గజ్వేల్లో రాస్తారోకో నిర్వహించారు. ప్రజ్ఞాపూర్ రాజీవ్రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ను శిక్షించాలని డిమాండ్ చేశారు.
![గజ్వేల్లో రోడ్డు ప్రమాద మృతుడి బంధువులు ఆందోళన siddipet crime news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6194356-thumbnail-3x2-gagwel-rk.jpg)
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఆర్టీసీ డిపో ఎదురుగా ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని టిప్పర్ వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న శేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు.
ప్రమాదానికి కారకుడైన టిప్పర్ డ్రైవర్ను గుర్తించి కఠింనంగా శిక్షించాలంటూ మృతుడి తరఫు బంధువులు సోమవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తావద్ద రాస్తారోకో చేశారు. సుమారు గంట పాటు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులకు నచ్చచెప్పి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.