తెలంగాణ

telangana

ETV Bharat / state

హుస్నాబాద్​లో ఘనంగా రెడ్డి బతుకమ్మ సంబురాలు - siddipet district latest news

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కేజేఆర్ గార్డెన్​లో రెడ్డి బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి.. కోలాట నృత్యాలతో ఆడి పాడారు. అనంతరం బతుకమ్మలను సమీప చెరువులో నిమజ్జనం చేశారు.

Reddy Batukamma celebrations in Husnabad
హుస్నాబాద్​లో ఘనంగా రెడ్డి బతుకమ్మ సంబురాలు

By

Published : Oct 23, 2020, 12:23 AM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కేజేఆర్ గార్డెన్​లో రెడ్డి జేఏసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు అయిలేని మల్లికార్జున్​రెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్ డివిజన్​కు చెందిన సుమారు 100 మంది రెడ్డి కులానికి చెందిన మహిళలు బతుకమ్మ పాటలకు కోలాటాలతో నృత్యాలు చేశారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ అనిత రెడ్డి బతుకమ్మ పాటలు పాడగా.. మహిళలు నృత్యాలు చేశారు.

కరోనా నేపథ్యంలో మహిళలు మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు పాటిస్తూ బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో రెడ్డి జేఏసీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండిఃసిడ్నీలో కన్నుల పండువగా బతుకమ్మ, దసరా వేడుకలు

ABOUT THE AUTHOR

...view details