అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి భూమి పూజను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలో యువత గ్రామంలో పెద్ద ఎత్తున కాషాయ తోరణాలు, జెండాలు అలంకరించారు.
అంతా రామమయం: శ్రీరాముడి మాస్కులతో అలరించిన యువత - మిరుదొడ్డిలో రాముడి మాస్కులతో యువత
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రమంతా రామమయం అన్నట్లుగా మారింది. ఎటు చూసినా కాషాయ జెండాలు చెవులు మారుమోగేలా రామనామస్మరణలతో.. ముఖాలకు రాముడి చిత్రంతో కూడిన మాస్కులు ధరించి యువకులు రామభక్తిని చాటారు.
అంతా రామమయం: శ్రీరాముడి మాస్కులతో అలరించిన యువత
కరోనావైరస్ వల్ల ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడినందున యువత రాముడి చిత్రంతో కూడిన మాస్కులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామమంతా పండుగ వాతావరణంతో కాషాయ జెండాలతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు తోట కమలాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీచూడండి :రామన్నకు... చిరునవ్వుతో ఓ కానుక