సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో తీగజాతికి చెందిన మొక్కకు పూసిన పుష్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. గతేడాది నాటిన తీగజాతికి చెందిన ఈ మొక్క ఈ ఏడాది పూలు పూసి అందరినీ ఆకర్షిస్తున్నది. అచ్చం రాఖీని పోలి ఉన్న ఈ పువ్వు రాఖీల పండుగ ముందు పూయడం వల్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహాభారతంలో శ్రీ కృష్ణుడు ఈ రాఖీ పుష్పాన్ని చేతికి కట్టుకున్నట్టు చెప్తారు. మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ రాఖీల కంటే.. ఈ రాఖీ పుష్పాలు బాగున్నాయని, మంచి సువాసన వస్తున్నాయని పలువురు అంటున్నారు. అన్నాచెల్లెల్ల బంధానికి ప్రతీకగా కట్టే రాఖీ స్థానంలో ప్లాస్టిక్ రాఖీకి బదులు.. పచ్చటి చెట్టుకు పూసిన రాఖీ పుష్పం ఉత్తమం అంటున్నారు స్థానికులు.
శ్రీ కృష్ణుడు కట్టుకున్న రాఖీ పుష్పం.. హుస్నాబాద్‌లో పూసింది! - హుస్నాబాద్ పోలీస్ స్టేషన్
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో తీగజాతికి చెందిన మొక్కకు పూసిన పుష్పాలు ఆకట్టుకుంటున్నాయి. తీగజాతికి చెందిన ఈ పుష్పాలు అచ్చం రాఖీని పోలి ఉండడం అందరూ ఆ పుష్పాలను పట్టుకొని మరీ చూస్తున్నారు. నాలుగేళ్ల క్రితం నాటిన ఈ మొక్క ఈ ఏడాది పువ్వులు పూసి.. చాలా బాగున్నాయని స్థానికులు అంటున్నారు.
శ్రీ కృష్ణుడు కట్టుకున్న రాఖీ పుష్పం.. హుస్నాబాద్‌లో పూసింది!