సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టును నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ సందర్శించారు. పనుల పురోగతిపై.. ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్‌లో ఉన్న చిన్న చిన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మొదట 20 ఎకరాలకు చెందిన భూ సేకరణ సమస్యను పరిష్కరించి... నిర్వాసితులకు రెండు, మూడు రోజుల్లో చెక్కులు అందిస్తామన్నారు. అక్టోబర్ నాటికి మొదటి పంపు మోటర్‌ను రన్ చేసి.. ప్రాజెక్టులోకి నీరు విడుదల చేసే ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో పంప్‌హౌస్ మోటార్లు కాస్త ఆలస్యంగా రానున్నాయని వెల్లడించారు.
అక్కన్నపేటలోని గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించిన రజత్‌కుమార్
భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ అధికారులకు సూచించారు. అక్కన్నపే మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టును ఆయన సందర్శించారు.
అక్కన్నపేటలోని గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించిన రజత్‌కుమార్
TAGGED:
gouravelli project news