సిద్దిపేట రూరల్ జిల్లా చిన్నగుండవెల్లిలో రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తమ భూముల్లో కాలువలు నిర్మించడంపై ఆందోళన చేశారు. పోలాల్లో భోజనం చేసి నిరసన తెలిపారు. సుడా పరిధిలోని విలువైన భూముల్లో కాలువలు నిర్మించడం చట్టవ్యతిరేకం కాదా అని అన్నదాతలు ప్రశ్నించారు. నిరసన చేపట్టి 20 రోజులు కావొస్తున్న స్థానిక ఎమ్మెల్యే, అధికారులు స్పందించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని రైతులు హెచ్చరించారు.
సిద్దిపేటలో రైతుల రిలే నిరాహార దీక్ష - రిలే నిరాహార దీక్ష
సిద్దిపేట రూరల్ చిన్నగుండవెల్లిలో అన్నదాతలు వారి భూముల వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తమ భూముల నుంచి కాలువలు నిర్మించడం పట్ల నిరసన తెలిపారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరారు.
సిద్దిపేటలో భోజనంతో రైతుల రిలే నిరాహార దీక్ష