గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. సిద్దిపేట జిల్లాలో చాలాచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. అయితే అల్పపీడనం వల్ల కురిసిన వర్షాలు.. తగ్గినట్లే తగ్గి.. మళ్లీ మంగళవారం రాత్రి నుంచి మొదలై ఓ మోస్తరుగా కురుస్తోంది.
సిద్దిపేటలో మళ్లీ వర్షం.. రహదారులపై వరదనీటి ప్రవాహం.. - rains started in siddipet from Tuesday night
సిద్దిపేట జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వానలు ఆగినట్లే ఆగి మళ్లీ మంగళవారం ప్రారంభమయ్యాయి. ఓ మోస్తరుగా వర్షం కురవగా చెరువులు, కుంటల నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
సిద్దిపేటలో మళ్లీ ప్రారంభమైన వర్షం.. ప్రవహిస్తోన్న వరద నీరు
చెరువులు, కుంటల్లోకి వరద నీరు ప్రవహిస్తోంది. కొన్ని గ్రామాల్లో వర్షానికి ఇళ్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇదీ చూడండి :తెలంగాణలో కొత్తగా 1,763 కరోనా కేసులు, 8 మరణాలు