తెలంగాణ

telangana

ETV Bharat / state

చేనేత కార్మికుల దీక్షకు రఘునందన్​రావు మద్దతు - raghunandan rao agrees to handloom workers protest at dubbaka

తమ సమస్యల పరిష్కారం కోసం చేనేత కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్​రావు సంఘీభావం తెలిపారు. ఏపీలో ఇస్తున్నట్లు నేతన్నలకు చేనేత బంధు పథకాన్ని మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

handloom workers protest at dubbaka
చేనేత కార్మికుల రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన రఘునందన్​రావు

By

Published : Sep 9, 2020, 10:54 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చేనేత కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మొదటి రోజు భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్​రావు సంఘీభావం తెలిపారు. రైతులకు అందిస్తున్న రైతు బీమా లాగానే ప్రతి చేనేత కార్మికునికి రూ. ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని రఘునందన్​రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో చేనేత కార్మికుల కోసం అమలు చేస్తున్న చేనేత బంధు పథకాన్ని తెలంగాణలోనూ కేసీఆర్​ సర్కారు వెంటనే అమలు చేయాలని రఘునందన్​రావు కోరారు. ప్రతి చేనేత కుటుంబానికి వ్యాపార అభివృద్ధి కోసం వ్యక్తిగత రుణాలను ఎలాంటి షరతులు లేకుండా మంజూరు చేయాలన్నారు.

ఇదీ చదవండి:ఇకనుంచి తహసీల్దార్లే జాయింట్‌ రిజిస్ట్రార్‌లు: కేసీఆర్‌

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details