సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతిని పురస్కరించుకొని సీపీఎం నాయకులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన రాజకీయ, ప్రజాజీవన ప్రస్థానాన్ని మననం చేసుకున్నారు. సుందరయ్య జీవితాయశానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
' విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతినిధి' - Puchalapalli Sundarayya
దక్షిణ భారత దేశ కమ్యూనిస్టు ఉద్యమనాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్థంతిని సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో సీపీఎం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్థంతి
విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతినిధి అని కొనియాడారు. ఈ సందర్భంగా లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన 30 మంది హోటల్ కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జి. భాస్కర్, నాయకులు సాదిక్, ప్రశాంత్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.