తెలంగాణ

telangana

ETV Bharat / state

సైకో వీరంగం... వ్యక్తిపై కర్రతో దాడి - వ్యక్తిపై సైకో దాడి

సిద్ధిపేట జిల్లా పందిళ్ల గ్రామంలో అర్ధరాత్రి ఓ వ్యక్తి సైకోలాగా వీరంగం సృష్టిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాడు.

psycho attack on man in husnabad siddipeta
సైకో వీరంగం.. వ్యక్తిపై కర్రతో దాడి

By

Published : Apr 21, 2020, 5:56 AM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్లలో భాషంపల్లి వీరస్వామి అనే వ్యక్తి అర్ధరాత్రి వీరంగం సృష్టించాడు. గతంలో ఓసారి వీరస్వామి పిల్లలు, గ్రామస్థులపై దాడిచేస్తూ పిచ్చివాడిలా వ్యవహిరించగా వైద్యులు ఎర్రగడ్డ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. కానీ మెజిస్ట్రేట్​ ముందు హాజరుపర్చగా అతను సమాధానాలన్నీ కరెక్ట్​గా చెప్పడం వల్ల అతనికి పిచ్చిలేదని కోర్టు తీర్మానించి విడుదల చేసింది.

మూడు నెలలైనా కాకముందే మళ్లీ నిన్న రాత్రి కాచవేని సమ్మయ్య అనే వ్యక్తి పై వీరస్వామి కర్రతో దాడి చేసి గాయపర్చాడు. గ్రామస్థులు సైకో వీరస్వామికి దేహశుద్ధి చేసి బంధించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

సైకో వీరంగం.. వ్యక్తిపై కర్రతో దాడి

ఇవీచూడండి:పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది

ABOUT THE AUTHOR

...view details