తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి' - తెలంగాణ వార్తలు

హుస్నాబాద్​ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసి.. కొవిడ్​ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్​ చేశారు. లేకుంటే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

husnabad hospital, congress protest, mla camp office
husnabad hospital, congress protest, mla camp office

By

Published : May 9, 2021, 2:42 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, కొవిడ్​ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు.

"హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకలతో ఏర్పాటు చేశారు. అయినా కనీసం 30 పడకల ఆసుపత్రిలో ఉండే వసతులు కూడా లేక వ్యాధిగ్రస్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు, హాస్టల్ భవనాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో కరోనా ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది"

-కేడం లింగమూర్తి, డీసీసీ అధికార ప్రతినిధి

పెళ్లిళ్లకు, ఆలయాలకు, పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవాలకు మాత్రం స్థానిక ఎమ్మెల్యే వెళ్తున్నారని.. నియోజకవర్గంలో కరోనా రోగుల పరిస్థితిని సమీక్షించడంలేదని ఆయన ఆరోపించారు.

ఇదీ చూడండి:సీఎంలకు మోదీ ఫోన్​- కొవిడ్ పరిస్థితులపై ఆరా

ABOUT THE AUTHOR

...view details