ఉద్యోగ అవకాశాలొస్తాయని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే.. ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని భాజపా జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేవైఎం ఆధ్వర్యంలో సిద్దిపేట పొన్నాల రాజీవ్ రహదారిపై ధర్నా నిర్వహించారు.
ఖాళీలను భర్తీ చేయాలని రాజీవ్ రహదారిపై ఆందోళన - సిద్దిపేట వార్తలు
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ.. సిద్దిపేట పొన్నాల రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు బీజేవైఎం నాయకులను అరెస్టు చేశారు.

ఖాళీలను భర్తీ చేయాలని రాజీవ్ రహదారిపై ఆందోళన
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీతోపాటు నిరుద్యోగ భృతీ చెల్లించాలని డిమాండ్ చేశారు. రహదారిపై బైఠాయించిన బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.
ఇదీ చూడండి:"కొత్త" వైరస్ ప్రాణాంతకమేమీ కాదు.. కానీ..: మంత్రి ఈటల