తెలంగాణ

telangana

ETV Bharat / state

పాఠశాలలు పునఃప్రారంభించాలని ప్రైవేట్ టీచర్ల డిమాండ్ - private teachers protest in siddipet

ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులుగా పని చేయడం కంటే టీ కొట్టు పెట్టుకోవడం నయమని ప్రైవేట్ టీచర్లు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ట్రస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ టీచర్లు ఆందోళనకు దిగారు.

private teachers, private teachers protest
ప్రైవేట్ టీచర్ల ధర్నా, సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్

By

Published : Apr 3, 2021, 1:12 PM IST

కరోనా నేపథ్యంలో ఏడాది నుంచి పాఠశాలలు నడవకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్​ ప్రశ్నార్థకంగా మారిందని ప్రైవేట్ టీచర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ట్రస్మా ఆధ్వర్యంలో రహదారులపై టీ, కూరగాయలు అమ్ముతూ నిరసన చేపట్టారు. ప్రైవేట్ పాఠశాలలు నడపడం, ప్రైవేట్ ఉపాధ్యాలుగా పని చేయడం కంటే టీ కొట్టు పెట్టుకోవడం నయమని అన్నారు.

కూరగాయలు విక్రయిస్తూ టీచర్ల నిరసన

రాష్ట్ర వ్యాప్తంగా.. ట్రస్మా పిలుపుమేరకు వినూత్న నిరసనలు చేపడుతున్నామని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్... విద్యార్థులు, వారి భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

టీ విక్రయిస్తున్న ప్రైవేట్ టీచర్లు

ABOUT THE AUTHOR

...view details