తెలంగాణ

telangana

ETV Bharat / state

siddipet girls school: విద్యార్థినులకు అస్వస్థత ఘటనలో పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్.. - విద్యార్థులు అస్వస్థత

siddipet girls school: సిద్దిపేట మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంపై అధికారులు సీరియస్ అయ్యారు. పాఠశాల ప్రిన్సిపల్​ను సస్పెండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని విధుల నుంచి తొలగించారు.

siddipet girls school
విద్యార్థినులకు అస్వస్థత

By

Published : Jun 29, 2022, 9:01 PM IST

siddipet girls school: సిద్దిపేట మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్​ను అధికారులు సస్పెండ్​ చేశారు. ఆహారం కలుషితమై 128 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. విద్యార్థులను పరామర్శించిన మంత్రి హరీశ్ రావు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా గురుకుల పాఠశాల వార్డెన్, కిచెన్ సిబ్బంది విధుల నుంచి తొలగించారు. ఇటీవల ఆహారం కలుషితం కావడంతో అస్వస్థతకు గురయ్యారు.

ఎన్‌ఎస్‌యూఐ నేతలు అరెస్టు:సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు వద్ద ఎన్‌ఎస్‌యూఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. రామునిపట్ల వద్ద బల్మూరి వెంకట్‌ను అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట మైనార్టీ గురుకుల పాఠశాలకు వెళ్తుండగా అడ్డుకున్నారు. విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు నిలువరించారు. పోలీసుల వైఖరికి నిరసనగా పాఠశాల ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details