తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదావరి మహాహారతి గోడప్రతుల ఆవిష్కరణ - ధర్మపురిలో గోదావరి మహాహారతికి గోడప్రతుల ఆవిష్కరణ

జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో ఈ నెల 24న జరగనున్న గోదావరి మహాహరతి కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఆవిష్కరించారు.

గోదావరి మహాహారతి గోడప్రతుల ఆవిష్కరణ

By

Published : Nov 20, 2019, 3:04 PM IST

గోదావరి మహాహారతి గోడప్రతుల ఆవిష్కరణ

ఈ నెల 24న జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరగనున్న గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరగోపాల్ కోరారు. కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో ఆవిష్కరించారు. పవిత్ర గోదావరి మహా హారతికి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. భక్తులు హారతిలో పాల్గొని స్వామి ఆశీస్సులను పొందాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details