తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​ను చూసి తెరాస భయపడుతోంది: పొన్నం ప్రభాకర్ - దుబ్బాక ఎన్నికలు 2020

కాంగ్రెస్​ను చూసి తెరాస భయపడుతోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. భయంతో కాంగ్రెస్​ నాయకులను తెరాసలో చేర్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మంత్రి హరీశ్ రావు చెప్పేవన్నీ అబద్ధాలని... దుబ్బాక ప్రజలు వాటిని నమ్మవద్దన్నారు.

ponnam-prabhakar-comments-on-minister-harish-rao-about-dubbaka-elections
కాంగ్రెస్​ను చూసి తెరాస భయపడుతోంది: పొన్నం ప్రభాకర్

By

Published : Oct 9, 2020, 6:18 PM IST

దుబ్బాకలో ప్రభుత్వం అభివృద్ధి చేసి ఉంటే... మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్‌ను చూసి ఎందుకు భయపడుతున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. హరీశ్ రావు చెప్పేవన్నీ అబద్ధాలేనని... ప్రజలు వాటిని నమ్మవద్దంటూ వ్యాఖ్యానించారు.

దుబ్బాకలో తెరాస గెలుస్తుందంటూనే... కాంగ్రెస్ నాయకులను ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఎప్పుడైనా దుబ్బాకకు వచ్చారా అన్న మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై పొన్నం స్పందించారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఎన్నిసార్లు దుబ్బాకకు వచ్చారంటూ ప్రశ్నించారు. కేసీఆర్​కు సిద్దిపేటపైన ఉన్న ప్రేమ... దుబ్బాకపై ఎందుకు లేదంటూ ప్రశ్నించారు. దుబ్బాకలోని ఏ గ్రామానికైనా వెళ్దామని... ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయో.. డబుల్​బెడ్​ రూమ్​ ఇళ్లు ఉన్నాయో చూద్దామంటూ పొన్నం సవాల్ విసిరారు.

ఇదీ చూడండి:దుబ్బాక నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం: హరీశ్​ రావు

ABOUT THE AUTHOR

...view details