తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబ్బాకలో ఊపందుకున్న ఉపఎన్నికల ప్రచారం - దుబ్బాక నియోజకవర్గం తాజా వార్తలు

ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మంగా తీసుకున్న దుబ్బాక ఉపఎన్నిక సమరంలో ప్రచారం వేడెక్కింది. తెరాస, భాజపా, కాంగ్రెస్‌ నేతలు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. అభివృద్ధి పథకాలను అధికార పార్టీ ప్రస్తావిస్తుండగా.. ఒక్కసారి అవకాశమిస్తే పనిచేసి చూపిస్తామని భాజపా, కాంగ్రెస్‌ నేతలు ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

దుబ్బాకలో ఊపందుకున్న ఉపఎన్నికల ప్రచారం
దుబ్బాకలో ఊపందుకున్న ఉపఎన్నికల ప్రచారం

By

Published : Oct 10, 2020, 9:39 PM IST

దుబ్బాకలో ఊపందుకున్న ఉపఎన్నికల ప్రచారం

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తెరాస తరఫున బరిలో దిగిన సోలిపేట సుజాతకు మద్దతుగా మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. దుబ్బాక, రాయ్‌పోల్ మండలాల్లో హరీశ్ రావు సమక్షంలో పలువురు యువకులు తెరాసలో చేరారు. దౌల్తాబాద్ మండలంలో తెరాస అభ్యర్థి సుజాతతో కలిసి.. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మహిళలను కించపరిచేలా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారని పద్మాదేవేందర్ రెడ్డి మండిపడ్డారు.

గెలుపే లక్ష్యంగా ప్రచారం..

కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. రాయపోల్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు దుబ్బాక ఉప ఎన్నికను సవాలుగా తీసుకొని కార్యకర్తలు పనిచేయాలని కోరారు.

దుబ్బాకలో పాగా వేయాలనే సంకల్పంతో భాజపా నేతలు మండలాల వారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అభ్యర్థి రఘునందన్‌రావుకు సంఘీభావంగా సీనియర్‌ నేతలు ప్రచార బాధ్యతలు మోస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ విస్మరించిందని కమలం నేతలు విమర్శిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో దుబ్బాక ఉపపోరు ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి:'వానా కాలం వస్తే ఉసిల్లు.. ఎన్నికలు వస్తే కాంగ్రెస్​ నాయకులు'

ABOUT THE AUTHOR

...view details