తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు భద్రతా వారోత్సవాల్లో హెల్మెట్​పై అవగాహన - రోడ్డు భద్రతా వారోత్సవాల్లో హెల్మెట్​పై అవగాహన

31వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ, రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

POLICE RYALY IN SIDDIPET
రోడ్డు భద్రతా వారోత్సవాల్లో హెల్మెట్​పై అవగాహన

By

Published : Feb 1, 2020, 3:20 PM IST

సిద్దిపేట కేంద్రంలో పోలీసుశాఖ, రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బైక్​ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా రవాణా కార్యాలయం నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా ఈ బైక్ ర్యాలీ కొనసాగింది. సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

హెల్మెట్ ధారణ విశిష్టతపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదంలో ఎక్కువమంది తలకు గాయం కావడం వల్లే చనిపోతున్నారని సీపీ పేర్కొన్నారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. మీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా బైక్​పై బయటకు వెళ్తుంటే ఇంట్లోని వారు బాధ్యతాయుతంగా అతనికి హెల్మెట్ ఇవ్వాలని జోయల్​ డేవిస్​ సూచించారు.

రోడ్డు భద్రతా వారోత్సవాల్లో హెల్మెట్​పై అవగాహన

ఇదీ చూడండి: ఎమ్మెల్యేలకే సహకార బాధ్యతలు!

ABOUT THE AUTHOR

...view details