సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు గస్తీని మరింత బలపరిచారు. వచ్చేపోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
దుబ్బాకలో పోలీసుల పటిష్ఠ నిఘా... మంత్రి హరీశ్ కారు తనిఖీ - దుబ్బాక ఎన్నికల సందర్భంగా పోలీసుల వాహన తనిఖీలు
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. పట్టణంలోకి వచ్చే అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నిన్న దుబ్బాకలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
దుబ్బాకలో పోలీసుల పటిష్ఠ నిఘా... మంత్రి హరీశ్ కారు తనిఖీ
సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న మంత్రి హరీశ్‌రావు వాహనాన్ని మెట్టు వద్ద సోదాలు చేపట్టారు. కారు డిక్కీలో ఉన్న సామాగ్రిని పరిశీలించారు. అందులో ఏం లేకపోయేసరికి వాహనాన్ని పంపించారు.
ఇదీ చూడండి:దుబ్బాకలో భాజపా గెలవబోతోంది: బండి సంజయ్